Todays Telugu Bible Reading WhatsApp Status Video November 5, 2025
ఈరోజు తెలుగు బైబిల్ వాక్యము/ఈరోజు బైబిల్ పఠనం నవంబర్ 5 2025
లూకా సువార్త 14:25-33
అపుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను:
“నన్ను వెంబడింపగోరి, తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు.
తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు.
గోపురము కట్టదలచినవాడు కూర్చుండి వ్యయము గుణించి, దానిని పూర్తిచేయు సాధనసంపత్తి తనవద్ద ఉన్నదా, లేదా అని పర్యాలోచన చేయడా?
అటులకాక, పునాది వేసిన పిదప, నిర్మాణము పూర్తిచేయజాలని యెడల చూచువారు,
'ఇతడు ఆరంభశూరుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను' అని పరిహసించెదరు.
ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు, ఇరువదివేల సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన పదివేల సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా?
అంత బలములేనియెడల, శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును.
కనుక తన సమస్తము త్యజించిననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు.”
Telugu Bible Reading November 5 2025, Telugu daily Bible Reading video, Telugu today’s Gospel Reading November 5 2025 , Telugu Daily Bible reading Whatsapp Status, , Telugu daily devotional video, Telugu Bible study video daily, Telugu Christian daily scripture



