Today Telugu Gospel readings November 6 2025
ఈరోజు తెలుగు బైబిల్ వాక్యము/ఈరోజు బైబిల్ పఠనం నవంబర్ 6 2025

 

లూకా సువార్త 15:1-10

 

సుంకరులు, పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయనవద్దకు వచ్చుచుండిరి.

అది చూచి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు “ఇతడు పాపులను చేరదీయుచు, వారితో కలిసి భుజించుచున్నాడు” అని సణుగుకొనసాగిరి.

అపుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను:

“ఒకడు తనకు ఉన్న నూరు గొఱ్ఱెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబది తొమ్మిదింటిని ఆ అరణ్యముననే విడిచి పెట్టి, దానిని వెదకుటకై పోవునుగదా!

అది దొరికినపిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసికొని, ఇంటికి తీసికొని వచ్చి,

తన మిత్రులను, ఇరుగు పొరుగు వారలను పిలిచి, 'తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినది. నాతోపాటు ఆనందింపుడు' అని చెప్పును.

అట్లే హృదయపరివర్తనము అవసరము లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతులకంటె, హృదయపరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను.

“పది వెండినాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొనినయెడల, దీపము వెలిగించి, ఇల్లు ఊడ్చి, అది దొరకునంతవరకు పట్టుదలతో వెదకదా?

అది దొరకగనే స్నేహితురాండ్రను, ఇరుగుపొరుగు స్త్రీలను చేరబిలిచి 'నాతో పాటు ఆనందింపుడు. నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినది' అని చెప్పును.

అట్లే హృదయపరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను.”

 

Today Telugu Gospel readings November 6 2025, Telugu daily gospel reading, Telugu daily Bible verses video, Telugu devotional Bible reading