Today Telugu Gospel readings November 7 2025
ఈరోజు తెలుగు బైబిల్ వాక్యము/ఈరోజు బైబిల్ పఠనం నవంబర్ 6 2025

లూకా సువార్త 16:1-8

 

యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను: “ఒక ధనవంతుని వద్ద గృహనిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృథా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను.యజమానుడు అతనిని పిలిచి, 'నిన్నుగూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహనిర్వాహకుడుగా ఉండ వీలుపడదు' అని చెప్పెను.అతడు లోలోపల ఇట్లు అనుకొనెను: 'ఇపుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు. బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది.గృహనిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరివలన ఆశ్రయము పొందుటకు నేను ఇట్లు చేసెదను' అని,యజమానుని ఋణస్టులను ఒక్కొక్క రిని పిలిపించి, మొదటివానితో 'నీవు నా యజమానునికి ఎంత ఋణపడి ఉన్నావు?” అని అడిగెను.వాడు 'నూరు మణుగుల నూనె' అని చెప్పెను. అపుడు అతడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని, వెంటనే దానిపై ఏబది అని వ్రాసికొనుము' అని చెప్పెను.అంతట అతడు రెండవవానితో 'నీవు ఎంత ఋణ పడి ఉంటివి?' అని అడిగెను. వాడు 'నూరుతూముల గోధుమలు' అని బదులుపలికెను. అపుడు వానితో 'నీ ఋణపత్రము తీసికొని ఎనుబది అని వ్రాసికొనుము' అనెను.ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయన, ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులగు ప్రజలకంటె యుక్తిపరులు.

 

Today Telugu Gospel readings November 7 2025, Telugu daily gospel reading, Telugu daily Bible verses video, Telugu devotional Bible reading