Today Telugu Bible Readings Video Sunday November 9 2025

ఈరోజు తెలుగు బైబిల్ వాక్యము/ఈరోజు బైబిల్ పఠనం నవంబర్ 9 2025

యోహాను సువార్త 2:13-22

 

యూదుల పాస్కపండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను.

దేవాలయములో ఎడ్లను, గొఱ్ఱెలను పావురములను అమ్ము వారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను.

ఆయన త్రాళ్ళతో కొరడా పేని, గొఱ్ఱెలను, ఎడ్లను అన్నింటిని ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను.

పావురములను అమ్మువారితో “వీనిని ఇక్కడనుండి తీసికొనిపొండు. నా తండ్రి ఇంటిని వ్యాపారగృహముగా చేయవలదు” అని చెప్పెను.

“నీ గృహమునందు నాకుగల ఆసక్తి నన్ను దహించును” అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అపుడు తలపునకు వచ్చెను.

యూదులు అపుడు ఆయనతో “నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు?” అని ప్రశ్నించిరి.

అందుకు యేసు “ఈ ఆలయమును మీరు పడగొట్టుడు. నేను దీనిని మూడు రోజులలో లేపుదును” అని వారికి సమాధాన మిచ్చెను.

“ఈ ఆలయ నిర్మాణమునకు నలువది ఆరు సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని మూడు రోజులలో లేపగలవా?” అని యూదులు తిరుగు ప్రశ్నవేసిరి.

కాని, వాస్తవముగ ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే.

ఆయన మృతులలోనుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి.

 

Today Telugu Bible Readings Video Sunday November 9 2025, Daily Bible Reading Telugu, Telugu Daily Bible Verses Video,  Telugu Catholic Bible Readings Today, Sunday Bible Readings,