Daily Bible Reading Telugu November 10 2025
రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త 17:1-6| క్షమాపణ-విశ్వాసము | 10-11-2025
ఈ రోజు 10-11-2025 యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.
యేసు తన శిష్యులకు ఉపదేశించుచు: “పాపపు శోధనలు రాకతప్పవు. కాని అందుకు కారకుడైన వానికి అనర్ధము.
ఈ చిన్నవారిలో ఎవ్వనినైన పాపము చేయుటకు పురిగొల్పినచో, అట్టివాడు మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు.
జాగరూకులు కండు. నీ సోదరుడు తప్పిదము చేసినయెడల అతనిని మందలింపుము. అతడు పశ్చాత్తాప పడినయెడల అతనిని క్షమింపుము.
అతడు దినమునకు ఏడు పర్యాయములు నీపట్ల తప్పిదము చేసి, ఏడుమార్లు నీ వద్దకు వచ్చి 'నేను పశ్చాత్తాప పడుచున్నాను' అని నీతో చెప్పిన యెడల, వానిని క్షమింపుము" అని చెప్పెను.
శిష్యులు ప్రభువుతో “మా విశ్వాసమును పెంపొందింపుము” అని కోరిరి.
“మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో, ఈ కంబళి చెట్టును 'వేరుతో పెల్లగిల్లి సముద్రములో నాటుకొనుము' అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును.
రోజువారీ బైబిల్ పఠనం, ఈరోజు బైబిల్ వచనం, పవిత్ర గ్రంథ పఠనం, Bible Verse of the Day Telugu November 10 2025 , Daily Bible Reading Telugu November 10 2025, Today Telugu Bible Readings Video November 10 2025, Daily Bible Reading Telugu, Telugu Daily Bible Verses Video, Telugu Catholic Bible Readings Today,



