Today Bible Reading Telugu November 12 2025

రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త 17:11-19| పదిమంది కుష్టురోగులు   | 12-11-2025

ఈ రోజు 12-11-2025 యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.

 

యేసు సమరియా, గలిలీయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను.

ఒక గ్రామమున అడుగు పెట్టగనే పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి,

గొంతెత్తి, “ఓ యేసుప్రభువా! మమ్ము కనికరింపుము" అని కేకలు పెట్టిరి.

యేసు వారిని చూచి “మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు” అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధిపొందిరి.

అపుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి, ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగివచ్చి,

యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు.

అపుడు యేసు “పదిమంది శుద్ధులు కాలేదా? మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ?

తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా?” అనెను.

పిదప యేసు అతనితో “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది. లేచి వెళ్ళుము” అనెను.

 

#రోజువారీ బైబిల్ పఠనం, #ఈరోజు బైబిల్ వచనం, #పవిత్ర గ్రంథ పఠనం, Bible Verse of the Day Telugu November 12 2025 , Daily Bible Reading Telugu November 12 2025, Today Telugu Bible Readings Video November 12 2025, Daily Bible Reading Telugu, Telugu Daily Bible Verses Video,  Telugu Catholic Bible Readings Today,