Daily Bible Reading Telugu November 13 2025

రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త 17:20-25

ఈ రోజు 13-11-2025  యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.

 

దేవునిరాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానము ఇచ్చెను: “దేవుని రాజ్యము కంటికి కనబడునట్లు రాదు.

'ఇదిగో! ఇక్కడ ఉన్నది. లేక అదిగో! అక్కడ ఉన్నది' అని ఎవ్వడును చెప్పజాలడు. ఏలయన, అది మీ మధ్యనే ఉన్నది.”

యేసు మరల తన శిష్యులతో ఇట్లు చెప్పెను: “మీరు మనుష్యకుమారుని కాలములో ఒక దినమునైనను చూడగోరుదురు. కాని మీరు చూడరు.

ఇదిగో! అతడు ఇక్కడ ఉన్నాడు. లేక అదిగో! అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు. కాని మీరు వెళ్ళవలదు. వారి వెంట పరుగెత్తవలదు.

ఏలయన మెరపు మెరసి ఒక దిక్కునుండి మరొక దిక్కు వరకు ప్రకాశించునట్లు మనుష్యకుమారుని రాకడ ఉండును.

ముందుగా అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరమువారిచే నిరాకరింపబడవలెను.

 

#రోజువారీ బైబిల్ పఠనం, #ఈరోజు బైబిల్ వచనం, #పవిత్ర గ్రంథ పఠనం, Bible Verse of the Day Telugu November 13 2025 , Daily Bible Reading Telugu November 13 2025, Today Telugu Bible Readings Video November 13 2025, Daily Bible Reading Telugu, Telugu Daily Bible Verses Video,  Telugu Catholic Bible Readings Today,