Daily Bible Reading Telugu November 14 2025

రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త 17:26-37  యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..

 

నోవా దినములయందు ఎట్లుండెనో, మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును.

జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచు ఉండిరి. జలప్రళయము వారిని నాశనము చేసినది.

ఇట్లే లోతు కాలమున కూడ జరిగినది. ప్రజలు తినుచు, త్రాగుచు, క్రయవిక్రయములు చేయుచు, సేద్యము చేయుచు, గృహములను నిర్మించుకొనుచు ఉండిరి.

కాని లోతు సొదొమనుండి విడిచిపోయిన దినముననే ఆకాశమునుండి అగ్ని గంధకము వర్షింపగా అందరు నాశనమైరి.

మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును.

ఆ నాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందికి దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలి పోరాదు.

లోతు భార్యను గుర్తు చేసికొనుడు.

తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును.

'ఆ రాత్రి ఒకే పడకమీద ఉన్న యిద్దరిలో ఒకడు కొనిపోబడును. ఒకడు విడిచిపెట్టబడును.

ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును. మరియొకరు విడిచి పెట్టబడును.”

“ప్రభూ! ఇది ఎక్కడ జరుగును?” అని శిష్యులు ప్రశ్నించిరి. “కళేబరమున్న చోటనే రాబందులు చేరును” అని యేసు చెప్పెను.

 

#రోజువారీ బైబిల్ పఠనం, #ఈరోజు బైబిల్ వచనం, #పవిత్ర గ్రంథ పఠనం, Bible Verse of the Day Telugu November 14 2025 , Daily Bible Reading Telugu November 14 2025, Today Telugu Bible Readings Video November 14 2025, Daily Bible Reading Telugu, Telugu Daily Bible Verses Video,  Telugu Catholic Bible Readings Today,