Telugu Daily Bible Reading for Sunday November 16th 2025

రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త  21:5-19 యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..

 

కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు “చక్కని రాళ్ళతోను, దేవునికి అర్పింపబడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు” అని చెప్పుకొనుచుండిరి.

అంతట యేసు వారితో “ఈ కట్టడమును మీరు చూచు చున్నారుగదా! ఇచ్చట రాతి పైరాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును” అనెను.

అప్పుడు వారు “బోధకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి.

అందుకు, ఆయన “మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నాపేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని మీరు వారివెంట వెళ్ళవలదు.

యుద్ధములను, విప్లవములనుగూర్చి వినినపుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగి తీరును. కాని, అంతలోనే అంతమురాదు” అనెను.

ఇంకను ఆయన వారితో ఇట్లనెను: “ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును.

భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును.

ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్థనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతులయొద్దకు మిమ్ములను తీసికొనిపోవుదురు.

ఇది మీరు సాక్షులుగ ఉండవలసిన సమయము.

మీరు అచట చెప్పవలసినదానిని గూర్చి కలవరపడకుడు.

విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును, వివేకమును ప్రసాదింతును.

తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులుకూడ మిమ్మును పట్టిఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు.

నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు.

కాని మీ తలవెంట్రుకకూడ రాలిపోదు.

మీ సహనమువలన మీరు మీ ప్రాణములను దక్కించు కొందురు.

 

ఆదివారం బైబిల్ పఠనం, నవంబర్ 16 2025 బైబిల్ పఠనం, Sunday Bible reading, Bible reading November 16 2025, Daily Scripture reflection,Christian devotional November 16