Today's Telugu Bible Gospel Readings November 17 2025
Daily Bible Reading Video Telugu
రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త 18:35-43 యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..
యేసు యెరికో పట్టణమును సమీపించు చుండగా త్రోవప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనుచుండెను.
వాడు ప్రజలు గుంపులుగా నడచుచప్పుడు విని “విశేషమేమి?" అని అడిగెను.
“నజరేతు నివాసియగు యేసు వెళ్ళు చున్నాడు” అని ప్రజలు వానికి చెప్పిరి.
అంతట వాడు “యేసూ! దావీదుకుమారా! నన్ను కరుణింపుము” అని కేకలు వేసెను.
ముందు నడచు ప్రజలు వానిని ఊరకుండుమని కసరుకొనిరి. వాడు ఇంకను బిగ్గరగా “దావీదుకుమారా! నన్ను కనికరింపుము” అని కేకలు పెట్టసాగెను.
యేసు నిలచి వానిని తన వద్దకు తీసికొనిరమ్మని ఆజ్ఞాపించెను.
వాడు దగ్గరకు రాగానే యేసు వానితో “నేను నీకేమి చేయ కోరుదువు?” అని అడిగెను. "ప్రభూ! నాకు దృష్టి దానము చేయుడు” అని వాడు బదులు పలికెను.
"అట్లే నీ చూపును పొందుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది” అని యేసు పలికెను.
ఆ క్షణమే వాడు దృష్టిని పొంది, దేవుని పొగడుచు ఆయనను అనుసరించెను. ఇది చూచిన ప్రజలందరు దేవుని స్తుతించిరి.



