Today Telugu Bible Reading Video November 18 Daily Bible Reading in Telugu Video
రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త 19:1-10 |యేసు-జక్కయ్య| యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..
యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దానిగుండ వెళ్ళుచుండెను.అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను.అతడు యేసును చూడవలెనని యత్నించెను. కాని పొట్టివాడగుటచేతను, జనసమూహము ఎక్కువగా ఉండుటచేతను చూడలేకపోయెను.కనుక అతడు ముందుకు పరుగుదీసి, ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై, ఒక మేడిచెట్టును ఎక్కెను.యేసు అచటకు వచ్చినపుడు పైకి చూచి, అతనితో “జక్కయ్యా! త్వరగా దిగిరమ్ము. ఈ దినము నేను నీ ఇంటిలోనుండ తలంచితిని” అని చెప్పెను.అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను.ఇది చూచిన వారందరు “ఈయన పాపియొద్దకు అతిథిగా వెళ్ళెను” అని సణుగుకొనసాగిరి.జక్కయ్య నిలబడి యేసుతో, “ప్రభూ! నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో నాలుగురెట్లు అతనికి ఇచ్చివేయుదును” అని చెప్పెను.అందుకు యేసు “నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలయన, ఇతడును అబ్రహాము కుమారుడే.మనుష్యకుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు” అని అతనితో చెప్పెను.



