Watch Today’s Telugu Bible reading video for November 19, 2025

 Daily Bible Reading in Telugu Video November 19 రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త  19:11-28  దేవుని వాక్యము ద్వారా శాంతి, బలము, ఆధ్యాత్మిక మార్గదర్శనం పొందండి...

 

యేసు యెరూషలేమును సమీపించు చుండుటవలన, పరలోకరాజ్యము వెంటనే అవతరింపనున్నదని ప్రజలు తలంచుచుండుటవలన, ప్రజలు వినుచుండగా యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను.

యేసు ఇట్లు చెప్పనారంభించెను: “గొప్ప వంశస్తుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావలయునని దూరదేశమునకు వెళ్ళెను.

అతడు తన పదిమంది సేవకులను పిలిచి తలకొక నాణెమును ఇచ్చి, 'నేను తిరిగివచ్చువరకు ఈ ధనముతో వ్యాపారము చేసికొనుడు' అని చెప్పెను.

ప్రజలు అతనిని ద్వేషించిరి. అందుచేవారు 'ఇతడు మమ్ములను పరిపాలించుటమాకు సమ్మతముకాదు' అని రాయబారులతోచెప్పి పంపిరి.

అతడు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినపుడు, ఒక్కొక్కడు ఎటుల వ్యాపారము చేసినది తెలిసికొనుటకు, తాను ధనమిచ్చిన సేవకులను తన వద్దకు పిలిపించెను.

మొదటివాడు వచ్చి 'అయ్యా! నీవిచ్చిన సొమ్ముతో ఇంకను పది నాణెములను సంపాదించితిని, అని చెప్పెను.

అందుకు అతడు ఆ సేవకునితో 'మంచిది. నీవు నమ్మినబంటువు. స్వల్ప విషయములందు శ్రద్ధవహించితివి. కనుక నిన్ను పది పట్టణములకు అధిపతిని చేసెదను' అనెను.

రెండవవాడు వచ్చి 'అయ్యా! నీవిచ్చిన సొమ్ముతో ఇంకను ఐదునాణెములను సంపాదించితిని' అని చెప్పెను.

'నిన్ను ఐదు పట్టణములకు అధిపతిని చేసెదను' అని అతడు చెప్పెను.

మరొకడు వచ్చి 'అయ్యా! ఇదిగో నీ నాణెము. దీనిని మూటకట్టి ఉంచితిని.

నీవు కఠినుడవు. నీవు అనిన నాకు భయము. నీవు ఈయని దానిని తీసికొనెదవు. విత్తని దానిని కోయుదువు' అని చెప్పెను.

అందుకు అతడు 'ఓరీ దుష్టుడా! నీ మాటలతోనే నిన్ను నీవు దోషివని ఋజువు చేసికొను చున్నావు. కఠినుడనని, పెట్టని దానిని తీసికొనెదనని, విత్తని దానిని కోసికొనెదనని నీవు ఎరుగుదువు.

అట్లయినచో నా సొమ్మును ఎందుకు వడ్డీకి ఇవ్వలేదు? నేను తిరిగివచ్చినపుడు వడ్డీతో సైతము పుచ్చుకొనెడివాడను'

అని చెప్పి అతడు చెంతనున్న వారితో 'వానివద్దగల ఆ నాణెము తీసికొని, పది నాణెములున్న వానికిండు' అని చెప్పెను.

అపుడు వారు 'బోధకుడా! వానివద్ద ఇప్పటికే పది నాణెములున్నవి గదా!' అని పలికిరి.

అందుకు ఆయన 'ఉన్న వానికే ఇంకను ఇవ్వబడును. లేనివానినుండి వాని వద్దనున్న కొంచెముకూడ తీసికొనబడును.

మంచిది. నా పాలనను అంగీకరింపని నా శత్రువులను వెంటనే ఇచటకు తీసికొనివచ్చి నా సమక్షముననే వారి తలలు తీయుడు' అని అతడు చెప్పెను.

యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వారికంటే ముందుగా పయనించెను.

 

దేవుని వాక్యము వీడియో, Telugu Bible Reading Today,November 19 2025 Bible Verse, Daily Scripture Video Telugu, Telugu Devotional Video,Bible Verse of the Day Telugu.Telugu Christian Inspiration,Bible Meditation Telugu,Daily Bible Study Telugu,Telugu Faith Content