Today Telugu Bible Reading Video November 22 Daily Bible Reading in Telugu Video
రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త 20:27-40 | యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..
ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సదూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి,
“బోధకుడా! ఒకడు సంతానము లేక మరణించిన యెడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి, అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే లిఖించెనుగదా!
అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయెను.
పిమ్మట రెండవవాడు
ఆ పిదప మూడవవాడు, అట్లే ఏడుగురును ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి.
ఆ పిదప ఆమెయు మరణించినది.
ఏడుగురును ఆమెను వివాహమాడిరి కదా! పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును?" అని అడిగిరి.
అందుకు యేసు “ఈ జీవితములో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును.
కాని పునరుత్థానమునకు యోగ్యులగువారు రానున్న జీవిత మున వివాహముకొరకు ఇచ్చిపుచ్చుకొనరు.
పునరుత్థానులగుటచే వారికి ఇక చావులేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు. దేవుని కుమారులు.
మండుచున్న ! పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఈసాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు పలికెను.
దేవుడు జీవితులకేగాని, మృతులకు దేవుడు కాడు. ఏలయన, ఆయన దృష్టికి అందరు సజీవులే” అని వారికి సమాధానము ఇచ్చెను.
అపుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు “బోధకుడా! నీవు సరిగా సమాధానమిచ్చితివి" అనిరి.
ఆ పిదప, వారు ఆయనను మరేమియు అడుగుటకు సాహసింపలేదు.



