Telugu Gospel Reading Today-November 23 Sunday Daily Bible Video
రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త 23:35-43 | యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..
ప్రజలు అచట నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. “ఇతడు ఇతరులను రక్షించెను. కాని, ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము” అని అధికారులు ఆయనను హేళనచేసిరి.
సైనికులు కూడ ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసమును ఇచ్చి,
“యూదుల రాజువైనచో, నిన్ను నీవు రక్షించుకొనుము” అని పరిహసించిరి.
"ఇతడు యూదుల రాజు” అని ఫలకమున వ్రాసి సిలువ పైభాగమున ఉంచిరి.
సిలువవేయబడిన నేరస్తులలో ఒకడు. “నీవు క్రీస్తువు గదా! అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములనుకూడ రక్షింపుము” అని ఆయనను నిందింపసాగెను.
రెండవవాడు వానిని గద్దించుచు “నీవు దేవునికి భయపడవా? నీవు కూడ అదే శిక్షను పొందుచున్నావుగదా!
మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగుఫలము అనుభవించుచున్నాము. కాని ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు” అని,
యేసు వంకకు తిరిగి, “యేసూ! నీవు నీ రాజ్యములో ప్రవేశించునపుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము” అని విన్నవించెను.
యేసు వానితో “నేడే నీవు నాతో కూడ పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను” అనెను.
Telugu Gospel Reading,Today Telugu Bible Reading,Sunday Gospel Telugu,Telugu Bible Video,Telugu Daily Gospel,Today Telugu Gospel Reading Video November 23, Telugu Sunday Bible Reading and Reflection, November 23 Telugu Bible Verse Explained, Telugu Gospel Reading for Sunday Mass, Telugu Christian Message for Today, Telugu Bible Reading November 23 2025



