Telugu Daily Bible Reading November 26 2025

రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త  21:12-19 యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..

 

 

ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్థనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతులయొద్దకు మిమ్ములను తీసికొనిపోవుదురు.

ఇది మీరు సాక్షులుగ ఉండవలసిన సమయము.

మీరు అచట చెప్పవలసినదానిని గూర్చి కలవరపడకుడు.

విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును, వివేకమును ప్రసాదింతును.

తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులుకూడ మిమ్మును పట్టిఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు.

నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు.

కాని మీ తలవెంట్రుకకూడ రాలిపోదు.

మీ సహనమువలన మీరు మీ ప్రాణములను దక్కించు కొందురు.

 

 బైబిల్ పఠనం నవంబర్ 26 2025 బైబిల్ పఠనం, Bible reading, Bible reading November 26 2025, Daily Scripture reflection,Christian devotional November 26