Telugu Daily Bible Reading Video 27  November 2025

రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త  21:20-28 యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..

Daily Bible Reading in Telugu  27  November 2025

 

“యెరూషలేము ముట్టడింపబడుటను కాంచినపుడు దానికి వినాశనము సమీపించినదని గ్రహింపుడు.

అపుడు యూదయాసీమలో ఉన్న వారు పర్వతములకు పారిపోవలయును. పట్టణము లో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలయును. వెలుపలనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు.

అవి ప్రతీకారదినములు. ఆ దినములలో లేఖనములలో వ్రాయబడినవి అన్నియు జరిగితీరును.

ఆ రోజులందు గర్భిణులకు, బాలింతలకు ఎంత బాధ! ఏలయన భూమిపై ఘోరమైన విపత్తుసంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు.

జనులు ఖడ్గమునకు బలియగుదురు. బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. అన్యులకాలము పరిపూర్తి అగువరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు.

“సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డుకాలము దాపురించును. సముద్రతరంగ గర్జనలతో ప్రజలెల్ల అల్లకల్లోలమగుదురు.

ఏలయన అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తులవలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు.

అపుడు మనుష్యకుమారుడు శక్తితోను, మహా మహిమతోను ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు.

ఇవి అన్నియు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తలయెత్తిచూడుడు. ఏలయన, మీ రక్షణకాలము ఆసన్నమైనది."

 

Telugu Bible Reading Today November 27,  Bible Verse  Daily Scripture Video Telugu, Telugu Devotional Video,Bible Verse of the Day Telugu.Telugu Christian Inspiration,Bible Meditation Telugu,Daily Bible Study Telugu,Telugu Faith Content