Daily Bible Reading Video in Telugu 6 DECEMBER 2025

 "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ. ..మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు.

TELUGU BIBLE READING VIDEO TODAY DECEMBER 6 2025

రోజువారీ బైబిల్ పఠనం డిసెంబర్ 6 |మత్తయి సువార్త 9:35-10:1, 5a, 6-8 యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..

Daily Bible Reading Video in Telugu 6 DECEMBER 2025

 

యేసు అన్ని పట్టణములను, గ్రామ ములను తిరిగి, ప్రార్థనామందిరములలో బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధిబాధలనెల్ల పోగొట్టు చుండెను.

నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొఱ్ఱెలవలె చెదరియున్న జనసమూహమును చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను.

అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ.

కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు” అని పలికెను.

యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు, వారికి అధికారమును ఇచ్చెను.

యేసు ఈ పన్నిద్దరు శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: “అన్య జనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు.

కాని, చెదరిపోయిన గొఱ్ఱెలవలెనున్న యిస్రాయేలు ప్రజలయొద్దకు వెళ్ళి,

పరలోకరాజ్యము సమీపించినదని ప్రకటింపుడు,

వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను ఎల్లగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు.

 

Telugu Bible Reading Today December 6, Telugu Bible Verse Daily Scripture Video Telugu, Telugu Devotional Video, Bible Verse of the Day Telugu. Telugu Christian Inspiration, Bible Meditation Telugu, Daily Bible Study Telugu, Telugu Faith Content