ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు” ఈ రోజు డిసెంబర్ 12, 2025 లూకా సువార్త 1:26-38 Today’s Telugu Bible Verse December 12-2025 Daily Scripture Reading ఈ రోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యంపై ధ్యానం చేయండి.
తదుపరి ఆరవమాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను.
ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ.
దేవదూత లోపలికి వచ్చి, ఆమెతో “అనుగ్రహపరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” అనెను.
మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా
దేవదూత “మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు.
ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు 'యేసు' అని పేరు పెట్టుము.
ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.
ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు” అనెను.
అంతట మరియమ్మ “నేను పురుషుని ఎరుగను కదా! ఇది ఎట్లు జరుగును?" అని దూతను ప్రశ్నించెను.
అందుకు ఆ దూత ఇట్లనెను: “పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్రశిశువు 'దేవుని కుమారుడు' అని పిలువబడును.
నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళి నదిగదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము.
ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు”
అంతట మరియమ్మ “ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!” అనెను. అంతట ఆ దూత వెళ్ళి పోయెను.
ఈ రోజు దేవుని వాక్యం, డిసెంబర్ 12 బైబిల్ చదువు,నేటి బైబిల్ వచనం,Daily Bible Reading Telugu,Bible Verse Today Telugu,బైబిల్ అధ్యాయం,Devotional Telugu.Scripture of the day Telugu,2025 Bible Reading



