Today Telugu Bible Reading Video November 25-Daily Bible Verse in Telugu
రోజువారీ బైబిల్ పఠనం| లూకా సువార్త 21:5-11 | యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..
Telugu Bible Reading Video November 25 | Daily Scripture & Devotion
Watch the Telugu Bible reading video for November 25 with today's daily scripture and devotional message. Strengthen your faith by reflecting on God’s Word in Telugu daily.
కొందరు ప్రజలు ఆలయమును గురించి ప్రస్తావించుచు “చక్కని రాళ్ళతోను, దేవునికి అర్పింపబడిన వస్తువులతోను ఎంత అందముగా శోభిల్లు చున్నదో చూడుడు” అని చెప్పుకొనుచుండిరి.
అంతట యేసు వారితో “ఈ కట్టడమును మీరు చూచు చున్నారుగదా! ఇచ్చట రాతి పైరాయి నిలువని కాలము వచ్చును. అంతయు నాశనము చేయబడును” అనెను.
అప్పుడు వారు “బోధకుడా! ఇవన్నియు ఎప్పుడు సంభవించును? దానికి సూచనయేమి?" అని అడిగిరి.
అందుకు, ఆయన “మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు. మోసపోకుడు. అనేకులు నాపేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కాని మీరు వారివెంట వెళ్ళవలదు.
యుద్ధములను, విప్లవములనుగూర్చి వినినపుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నియు జరిగి తీరును. కాని, అంతలోనే అంతమురాదు” అనెను.
ఇంకను ఆయన వారితో ఇట్లనెను: “ఒక జాతి మరియొక జాతిపై, ఒక రాజ్యము మరియొక రాజ్యముపై దాడి చేయును.
భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును.
Telugu Bible reading November 25, daily Bible verse Telugu, Telugu Bible video, Bible reading today, devotional video Telugu, Christian Bible verse November 25



