Today Telugu Bible Gospel Readings November 4 2025
ఈరోజు తెలుగు బైబిల్ వాక్యము/ఈరోజు బైబిల్ పఠనం నవంబర్ 4 2025
నవంబర్ 4 2025 నేటి తెలుగు బైబిల్ వాక్యము వీడియోలో లూకా సువార్త 14:15-24
ఈ మాటలకు ఆయన ప్రక్కన కూర్చున్న అతిథి ఒకడు “దైవరాజ్యమున భుజించువాడెంత ధన్యుడు!” అనెను.
అందుకు యేసు అతనితో, “ఒకమారు ఒకడు గొప్ప విందుచేసి అనేకులను పిలిచెను.
విందువేళకు అతడు, ఆహ్వానించిన వారికి 'అన్నియు సిద్ధమైనవి, బయలుదేరి రండు' అని సేవకునిద్వార వార్తను పంపెను.
కాని వారందరు సాకులు చెప్పసాగిరి. మొదటివాడు 'నేనొక పొలమును కొంటిని. దానిని చూచిరావలయును. కనుక నన్ను క్షమింపుము' అని మనవి చేసికొనెను.
రెండవవాడు 'నేను ఐదు జతల ఎడ్లను కొంటిని. వాటిని పరీక్షింప పోవుచున్నాను.కనుక నన్ను క్షమింపుము' అని అర్థించెను.
మరియొకడు 'నేను వివాహము చేసికొంటిని. కనుక రాలేను' అని చెప్పెను.
సేవకుడు తిరిగివచ్చి, ఈ విషయమును యజమానునికి తెలియజేయగా ఆ యజమానుడు మండిపడి, తన సేవకునితో 'నీవు వెంటనే నగరవీధులకు పేటలకు వెళ్ళి, పేదలను, అవిటి, గ్రుడ్డి, కుంటివారిని ఇక్కడకు తీసికొనిరమ్ము' అని ఆజ్ఞాపించెను.
అంతట సేవకుడు 'అయ్యా! నీవు ఆజ్ఞాపించినట్లు చేసితిని. కాని, ఇంకను స్థలమున్నది' అని చెప్పెను.
అందుకు ఆ యజమానుడు సేవకునితో 'రాజ మార్గములందును వీధిసందులందును వెదకి, అక్కడ కనబడిన వారిని బలవంతముగ తీసికొనివచ్చి నా ఇల్లు నిండునట్లు చూడుము.
ఏలయన, ఆహ్వానింపబడిన వారు ఎవ్వరును నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను” అనెను.
ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితం బలోపేతం చేసేందుకు, క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు సహాయపడుతుంది. ప్రతి రోజు బైబిల్ చదవడం ద్వారా మీరు దైవ సంబంధాన్ని మరింత గాఢం చేసుకోగలరు.
Today Telugu Bible Gospel Readings November 4 2025, Today Telugu Bible reading video, Telugu today’s Bible reading, Telugu daily scripture reading, Telugu Bible reading November 4 2025, Telugu daily devotional video, Telugu Bible study video daily, Telugu Christian daily scripture



